చిట్టిబాబుది చిన్నపల్లెటూరు.. రంగస్థలం. అందరికి శబ్దం వినిపిస్తే అతడికి మాత్రం కనబడుతుంది…అందే అతని స్పెషాలిటీ. ఊరిలో అందరూ అతడిని సౌండ్ ఇంజనీర్ అని పిలుస్తుంటారు. చెవులు వినబడకపోయినా పెదవుల కదలికలను బట్టి ఎవరూ ఏం చెబుతున్నారో ఇట్టే గ్రహించే అతను..ఊళ్లోకి పాముస్తే దాన్ని పట్టుకునేదాకా పోరాడతాడు. అలాగే..పాములాంటి మనుష్యులన్నా అతనికి మహా సెడ్డ చికాకు. 
తప్పుగా మాట్లాడితే తాట తీసే చిట్టిబాబు…రంగస్థలం ఊరి ప్రజలకు ఆపద్భాందవుడు. అయితే ఇప్పుడు ఓల్ తెలుగోళ్లందరికీ ఫేవరెట్ అయ్యిపోయాడు. అది ఎలా చెప్తామంటారా…ఆ కలెక్షన్స్ చూస్తే మీకూ ఆదే మాట అనాలనిపిస్తుంది. ఆయ్ ..నిజమండీ.. లేకపోతే ఏంటండీ..రిలీజయ్యి.ఇన్నాళ్లైనా ఇంకా జనాలు థియోటర్స్ దగ్గర టిక్కెట్లకు లైన్ లో నించోటమేండండీ..చోద్యం కాకపోతే.  అందుకే అతి తక్కువ టైమ్ లోనే 200 కోట్ల వ‌సూళ్ళు సాధించింది. 
ఇక చిట్టిబాబు ఇంతలా ముస్తాబు చేసి మనమీదకు వదిలిన సుకుమార్ ని అనాలి ముందు.  గ్రామీణ ప్రజల మనస్తత్వాలు, ఆహార్యాలు, పూరిళ్లు, తీర ప్రాంతాల అందాలకు పెద్దపీట వేస్తూ సాగే ఈ ఈ సినిమాని ఈ మద్యకాలంలో ఎవరూ ఇలాంటి సినిమా చూడలేదన్నట్లుగా తీసేసారు. 1985 కాలం నాటి పరిస్థితులను సహజత్వ కోణంలో ఆవిష్కరించారు అనేకన్నా యాజటీజ్ గా ఉన్నదున్నట్లు దించేసారని చెప్పాలి. ఈ మద్యకాలంలో రాని కొత్త నేపధ్యం,  కథ, కథనాలతో దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని సరికొత్తగా అందించాడు. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ ఇన్నాళ్లూ చేసిన సినిమాలు ఒకెత్తు..ఈ సినిమా ఒకెత్తు అన్న రీతిలో డిజైన్ చేసారు.
‘వేరుశనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగా తగిలిన లంకేబిందెలాగ ఎంతసక్కగున్నావే..లచిమి ఎంత సక్కంగున్నావే, సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యాబోతే చేతికి అందిన చందమామలాగ ఎంత సక్కగున్నావే..లచిమి’ అనే పాట ను తెరపైనే చూడాలి అనిపించేలా సమంత ఈ సినిమాకు స్పెషల్ ఎస్సెట్. 

Similar Posts
Latest Posts from VendiTera.com