ప్రేక్షకులకు బెస్ట్ ఫిల్మ్ ఇవ్వాలనే కసితో ఈ సినిమా చేశాం – ‘నిను వీడని నీడను నేనే’ ట్రైలర్ ఆవిష్కరణలో సందీప్ కిషన్

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంట్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. జూలై 12న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ను ఆదివారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ నిర్మాత ‘జెమిని’ కిరణ్, అనిల్ సుంకర ట్రైలర్ విడుదల చేశారు. నిర్మాత జెమినీ కిరణ్ మాట్లాడుతూ “సందీప్ కిషన్ కి నేను ఇచ్చిన హిట్ సినిమా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’లోని వెంకటాద్రి పేరు తీసుకుని ‘వెంకటాద్రి టాకీస్’ పేరుతో నిర్మాణ సంస్థ స్థాపించారు. వెరీ నైస్ ఆఫ్ హిమ్. సందీప్ కి ఆల్ ది బెస్ట్. సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నా” అన్నారు. అనిల్ సుంకర మాట్లాడుతూ “సందీప్ కిషన్ నిర్మాతగా మారి చేస్తున్న చిత్రమిది. ఒక హీరో నిర్మాణంలో అడుగుపెట్టడం డేరింగ్ స్టెప్. కథపై దర్శకుడి పై నమ్మకంతో ఈ సినిమా చేశాడు. ఈ ప్రయాణంలో తను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కాలని కోరుకుంటున్నా. సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలి. పెద్ద సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది. సందీప్ యాక్టింగ్, అన్యా సింగ్ గ్లామర్, తమన్ ఫెంటాస్టిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్… ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్. నిను వీడని నీడను నేనే తో సందీప్ కిషన్ ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మ్యాజిక్ re క్రియేట్ చేస్తాడని నమ్మకం ఉంది” అన్నారు.