‘విశ్వామిత్ర’ టైటిల్‌ లోగో విడుదల చేసిన అశుతోష్ రాణా

రాజ్‌కిరణ్‌ సినిమా బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘విశ్వామిత్ర’. నందితరాజ్‌, సత్యం రాజేశ్‌, అశుతోష్‌ రాణా, ప్రసన్నకుమార్‌, విద్యుల్లేఖా రామన్‌ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. రాజ్‌కిరణ్‌ దర్శకత్వంలో మాధవి అద్దంకి, రజనీకాంత్‌.ఎస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ లోగోను హైదరాబాద్‌ ప్రసాద్‌ల్యాబ్స్‌లో అశుతోష్‌ రాణా విడుదల చేశారు.  ఈ సందర్భంగా …. అశుతోష్‌ రాణా మాట్లాడుతూ – ”తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా టాలెంట్‌ ఉంది. అందుకు ఇక్కడివారు వివిధ విభాగాలను చక్కగా హ్యాండిల్‌ చేస్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే…నాకు మహిళలు లక్కీ ఎందుకంటే నా తొలి సినిమా దుష్మన్‌కి దర్శక నిర్మాతలు మహిళలే. ఈ సినిమాలో నందిత రాజ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు కాబట్టి ఈ సినిమా కూడా పెద్ద హిట్‌ అవుతుందని నమ్మకంగా ఉన్నాను. ఈ సినిమాలో నేను పొసెసివ్‌ భర్త పాత్రలో కనపడతాను. రాజ్‌కిరణ్‌గారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. ఈ సినిమాలో పనిచేసిన ఎంటైర్‌ యూనిట్‌కి అభినందనలు” అన్నారు.