ఉపేంద్ర ‘ఐ లవ్‌ యు’ టీజర్‌ విడుదల!

వైవీయస్‌ చౌదరి మాట్లాడుతూ ‘‘ఈ ‘ఐ లవ్‌ యు’ టైటిల్‌ చాలాసార్లు విన్న టైటిల్‌లా ఉంటుంది. కానీ, ఆ లోగోలో ఒక క్రియేటివ్‌ స్టాంప్‌ ఉంది అనే ఫీలింగ్‌ కలుగుతుంది. దానికి కారణం చంద్రు. సిరీస్‌ ఆఫ్‌ సినిమాల ద్వారా లవ్‌ స్టోరీస్‌లో హ్యూమన్‌ వేల్యూస్‌, సెన్సిటివ్‌ వేల్యూస్‌ చూపించాడు. సున్నితమైన మలుపులతో కూడిన డ్రామా నడుపుతూ కన్నడ, తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఉపేంద్రగారిది, చంద్రుది విచిత్రమైన బ్లెండింగ్‌ కాంబినేషన్‌. ప్రతి మనిషికి అంతర్గతం, బహిర్గతం ఉంటుంది. ఉపేంద్రగారి సినిమాల్లో హీరో క్యారెక్టర్‌కి బహిర్గతమే ఉంటుంది. లోపల ఏం ఉండదు. మనసులో భావాలను కుండబద్దలుగొట్టినట్టు హీరో మాట్లాడుతుంటాడు. ఆయన ఇమేజ్‌ని దృష్టిలో చంద్రు ‘ననే… ప్రేమించు’, నీకు నో ఛాయిస్‌ అని క్యాప్షన్‌ పెట్టి ఉంటాడు. ‘అర్జున్‌రెడ్డి’, ‘ఆర్‌ఎక్స్‌ 100’కి తాత ముత్తాత లాంటి సినిమాలను ఉపేంద్రగారు ఎప్పుడో తీశారు. ‘ఏ’, ‘ఓం’, ‘ఉపేంద్ర’ సినిమాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుండేది. హీరోకి ఒక క్యారెక్టరైజషన్‌ ఇచ్చి దాన్ని స్ట్రాంగ్‌గా ఫాలో అయ్యే దర్శకుల్లో పూరి జగన్నాథ్‌ ఒకడు. తను కన్నడలో ‘ఇడియట్‌’ తీసిన సమయంలో ఉపేంద్రగారి సినిమాలు తప్పకుండా చూసి ఉంటాడు. ‘ఇడియట్‌’కి ముందు పూరి సినిమాలు వేరు… ‘ఇడియట్‌’ తర్వాత వేరు. ఉపేంద్ర, పూరి ఆలోచనలు దగ్గరగా ఉంటాయి. నేను కో డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఉపేంద్రగారితో పనిచేసే అదృష్టం కలిగింది. నేను వైజయంతి మూవీస్‌లో పని చేస్తున్నప్పుడు చిరంజీవిగారి సినిమాకు దర్శకత్వం వహించమని ఆయన్ను పిలిపించారు. ఒక బ్యాచ్‌తో వచ్చారు. అప్పటివరకూ చేస్తున్న కథలను పక్కన పెట్టి… వేరే జానర్‌లో సినిమా ఇలా ఉంటుందని ఊహించలేని విధంగా రూల్స్‌ని బ్రేక్‌ చేస్తూ కొత్త కథ చెప్పారు. అందరూ షాకయ్యారు. కమర్షియల్‌ పంథాలో కొత్త కోణంలో కథ చెప్పారు. ఆయన చుట్టూ ఎప్పుడూ ఒక పాజిటివ్‌ ఎనర్జీ ఉంటుంది. ఆయన సినిమాల్లో సోషల్‌ వేల్యూస్‌ ఉంటాయి. సమాజంలో కష్టనష్టాలను బ్లంట్‌గా చూపిస్తారు. నిజంగా ఆయనకు ఒక పార్టీ పెట్టే అర్హత ఉంది. ఇమేజ్‌ ఉంది. ఒకప్పుడు తెలుగులో ఆయన సినిమాలు బ్రహ్మాండంగా ఆడాయి. అప్పటిలా ఈ సినిమా హిట్‌ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు.