ఉపేంద్ర ‘ఐ లవ్‌ యు’ టీజర్‌ విడుదల!

చిత్రదర్శకుడు ఆర్‌. చంద్రు మాట్లాడుతూ ‘‘తెలుగులో ఈ సినిమా విడుదలవుతుండటం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్‌ లగడపాటి శ్రీధర్‌గారికి నేను రుణపడి ఉంటాను. నేను తీసిన ‘చార్మినార్‌’ చూసి ‘నువ్వు తెలుగులో ఒక సినిమా తీయాలి’ అని, నా కథపై అభిమానంతో ఆయన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ నిర్మించారు. తెలుగుకు నన్ను పరిచయం చేశారు. ‘ఐ లవ్‌ యు’ నా కెరీర్‌లో 11వ సినిమా. నా ప్రొడక్షన్‌లో 4వ సినిమా. ఇండియాలో టాప్‌ టెన్‌ దర్శకుల్లో ఉపేంద్రసార్‌ ఉంటారు. శంకర్‌గారు చెప్పిన మాట ఇది. అటువంటి గొప్ప దర్శకుణ్ణి రెండోసారి దర్శకత్వం వహించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఉపేంద్రగారు హీరోగా నేను చేసిన తొలి సినిమా ‘బ్రహ్మ’ కన్నడలో బ్లాక్‌బస్టర్‌. ఇది రెండో సినిమా. ఒకసారి నేను టీవీ చూస్తున్నా. ‘ఆర్‌.ఎక్స్‌ 100’ బ్లాక్‌ బస్టర్‌. ఉపేంద్రగారి సినిమాలు చూసి అటువంటి ఐడియాతో సినిమా చేయాలని చేశామని చెప్పారు. ‘అర్జున్‌రెడ్డి’, ‘ఆర్‌.ఎక్స్‌ 100’తో ట్రెండ్‌ మారింది. అటువంటి సినిమాలు ఉపేంద్రగారు ఎప్పుడో తీశారు. ఆయన్ను అందరూ ఇప్పుడు ఫాలో అవుతున్నారు. నాకు అటువంటి లైన్‌ ఒకటి ఐడియా వచ్చింది. అవకాశం ఇస్తారా? అని ఆయన దగ్గరకు వెళ్ళా. ‘లవ్‌ అండ్‌ సెక్స్‌… అంటే ఎరోటిక్‌ కాదు. రొమాంటిక్‌’ అనే లైన్‌తో ఈ ట్రెండ్‌కి తగ్గట్టు సినిమా తీస్తే ఎలా ఉంటుందని ఆయన దగ్గరకు వెళ్ళా. ఆయన కథ విని, ‘ఇది ఒక గీతాంజలి అవుతుంది’ అన్నారు. లవ్‌, సెక్స్‌ మధ్య వ్యత్యాసాన్ని ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టు చెప్పాం. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. జీవితంలో ‘ఐ లవ్‌ యు’ ఎవరికి చెప్పాలి? మనం ఎవరికి చెబుతున్నాం? అనే థీమ్‌తో తెరకెక్కిన సినిమా ఇది. ఉపేంద్రగారి స్టైల్‌లో చెబుతున్నాం’’ అన్నారు.