ఉపేంద్ర ‘ఐ లవ్‌ యు’ టీజర్‌ విడుదల!

లగడపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ ‘‘ఉపేంద్రగారు రియల్‌ స్టార్‌, కల్ట్‌ స్టార్‌. నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ సినిమాల్లో ఆయన దర్శకత్వం వహించిన ‘ఓం’ సినిమా ఒకటి. నెల క్రితం మళ్ళీ చూశా. కన్నడలో ‘ఓం’ ఆ సినిమాను రీ రిలీజ్‌ చేస్తే బాగా ఆడిందని చెప్పారు. అలాగే, ఎన్నో సినిమాలు తీశారు. తెలుగులో ‘ఏ’ సినిమాతో కల్ట్‌ స్టార్‌గా యంగ్‌స్టర్స్‌లో పెద్ద ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు. మొన్నటికి మొన్న ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’లో మంచి క్యారెక్టర్‌ చేశారు. అందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ‘ఏ’ + ‘ఉపేంద్ర’ = ‘ఐ లవ్‌ యు’ అని చెప్పడం నచ్చింది. టైటిల్‌ కంటే క్యాప్షన్‌ ‘నన్నే.. ప్రేమించు’ నాకు బాగా నచ్చింది. ఉపేంద్రగారికి మాత్రమే అటువంటి ట్యాగ్‌ సరిపోతుంది. ఈమధ్య తెలుగులో ‘అర్జున్‌రెడ్డి’, ‘ఆర్‌.ఎక్స్‌ 100’ లాంటి కల్ట్‌ మూవీస్‌ వచ్చాయి. అటువంటి కల్ట్‌ మూవీగా ఈ సినిమా చేరుతుంది. ‘నన్నే… ప్రేమించు’ టైటిల్‌గా పెట్టి… ‘ఐ లవ్‌ యు’ క్యాప్షన్‌గా చేస్తే! ప్రేమ చిత్రాలకు కన్నడలో ఆర్‌. చంద్రు గాడ్‌ ఫాదర్‌. ఆయన తీసిన ఫస్ట్‌ నాలుగు సినిమాలు కన్నడలో సిల్వర్‌ జూబ్లీలు ఆడాయి. నాకు ఆ నాలుగు సినిమాలు నచ్చాయి. వాటిలో కొన్ని తెలుగులోకి వచ్చాయి. ‘తాజ్‌ మహల్‌’ను తెలుగులో తీశారు. ‘ప్రేమ్‌ కహానీ’, ‘మైలారీ’, ఆ తర్వాత వచ్చిన తీసిన ‘ఛార్మినార్‌’ నాకు బాగా నచ్చి తెలుగులో ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’గా రీమేక్‌ చేశా. అదే సినిమాను ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌కి పంపిస్తే… జైపూర్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బెస్ట్‌ రొమాంటిక్‌ ఫిల్మ్‌ అవార్డు వచ్చింది. నాకు ఒక మంచి చిత్రాన్ని అందించాడని మాత్రమే కాదు… నాకిష్టమైన దర్శకుల్లో అతను ఒకడు. ఉపేంద్రగారితో ‘బ్రహ్మ’ అని పెద్ద కమర్షియల్‌ సినిమా తీశారు. ఇప్పుడు ‘ఐ లవ్‌ యు’ కూడా తెలుగులో పెద్ద విజయం సాధించాలని, కల్ట్‌ క్లాసిక్‌ కావాలని కోరుకుంటున్నా. ఇప్పటివరకూ చంద్రు టీనేజర్స్‌తో, యంగ్‌స్టర్స్‌తో లవ్‌ స్టోరీస్‌ తీశారు. కానీ, ఈ రోజుల్లో పెళ్లి తర్వాత ప్రేమ చచ్చిపోతుందని, దానికి నిదర్శనంగా పెళ్లి తర్వాత ప్రేమకథ ఎలా ఉంటుందని కొత్తగా చూపించబోతున్న చంద్రుకి కంగ్రాట్స్‌. ఉపేంద్రగారితో సినిమా తీయాలని ఎప్పటినుంచో నా మనసులో ఉంది. త్వరలో ఛాన్స్‌ వస్తే తీస్తా. ఆయన దర్శకత్వంలో ఆయన యాక్ట్‌ చేయాలి. అయితే… ఆయన డెరెక్షన్‌ నా ఫెవరెట్‌ థింగ్‌. తెలుగులో పెద్ద స్టార్స్‌తో ఆయన సినిమా తీయాలని నా కోరిక. ఆయన థింకింగ్‌ ఇక్కడి వాళ్ళకు ఉండదు. ప్రజల పట్ల ఆయకున్న ఫీలింగ్స్‌ కూడా… ప్రజలే పాలించాల్సిన ప్రభుత్వాలు రావాలని కోరడం నాకు నచ్చింది. ఉపేంద్రగారిలా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తులు రాజకీయాల్లో రాణిస్తారని నా నమ్మకం’’ అన్నారు.