ఉపేంద్ర ‘ఐ లవ్‌ యు’ టీజర్‌ విడుదల!

ఉపేంద్ర మాట్లాడుతూ ‘‘ఇండస్ట్రీ పెద్దది ఎప్పుడు అవుతుందంటే… పెద్ద మనుషులు ఉంటేనే! ఈ రోజు పెద్ద నిర్మాతలు, దర్శకుడు, రచయితలు మా ఫంక్షన్‌కి రావడం సంతోషంగా ఉంది. నా గురించి గొప్పగా మాట్లాడుతుంటే నేను ఇంకా మంచి సినిమాలు చేయాలని ఇన్‌స్ఫైర్‌ అవుతున్నా. తెలుగులో చాలా బ్లాక్‌బస్టర్‌ సినిమాలు చేశారు. మీనుంచి నేను చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం స్ఫూర్తి తీసుకుంటున్నా. ఇప్పటికీ ఇంత యంగ్‌గా ఎలా ఉన్నారని అందరూ అడుగుతున్నారు. నా సీక్రెట్‌ ఒక్కటే… నేను ప్రతిదీ జీరో నుంచి మొదలుపెట్టా. చాలామంది అలాగే ప్రారంభించి ఉంటారు. అందుకే, పెద్దవాళ్ళు అయ్యారు. జీరో ఒక ప్లస్‌ ఏంటంటే… నథింగ్‌నెస్‌లో ఎవ్రీథింగ్‌ ఉంటుంది. మన దగ్గర ఏమీ లేదంటే అప్పుడు క్రియేటివిటీ స్టార్ట్‌ అవుతుంది. పెద్ద హీరోతో నా కెరీర్‌ స్టార్ట్‌ చేసి ఉంటే.. హీరో గురించి సినిమాకు ప్రేక్షకులు వస్తారని తక్కువ ఎఫ్టర్ట్స్‌ పెట్టేవాణ్ణి ఏమో! తెలియదు. చిన్న బడ్జెట్‌, కొత్తవాళ్ళతో చేసేటప్పుడు టైటిల్‌, పోస్టర్‌ డిజైన్‌ కూడా ఇంపార్టెంటే. థియేటర్‌ నుంచి బయటకు వెళ్ళాక నా సినిమా గురించి మాట్లాడాలంటే ప్రతి సన్నివేశం, మలుపు బావుండాలని ఆలోచించడానికి జీరోనే కారణం అయ్యింది. తర్వాత ఇప్పుడు జీరో నుంచి పొలిటికల్‌ పార్టీ స్టార్ట్‌ చేశా. ఎందుకు అంటే… రాజకీయాల్లో డబ్బులే సమస్య. రాజకీయాలు వ్యాపారంగా మారడంతో 20 శాతం మంది 80 శాతం మంది ఇన్నోసెంట్‌ పీపుల్‌ని రూల్‌ చేస్తున్నారు. అది మారాలని పార్టీ పెట్టాను. ఈ ‘ఐ లవ్‌ యు’ సినిమా గురించి చంద్రు చాలా చెప్పారు. సినిమాలో ఇంకా చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. సినిమా క్రెడిట్‌ అంతా ఆయనకే చెందుతుంది’’ అన్నారు.