*వేసవిలో అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్ ‘తుంబా’*

యువ తమిళ సంగీత సంచలనం అనిరుద్ రాజేంద్రన్ భయపడ్డాడు! ‘కొలవెరి డీ’ కుర్రాడి ముందుకు ఒక్కసారిగా పులి రావడంతో కంగారు పడ్డాడు! తన మనుషులను పిలుస్తూ కేకలు పెట్టాడు! సడన్ గా సిటీలోకి టైగర్ ఎక్కడ నుంచి వచ్చిందని అనుకుంటున్నారా? తనంతట తానుగా ఏదో అడవిలోంచి నగరం లోపలికి పులి రాలేదు. దర్శకుడు హరీష్ రామ్ తీసుకొచ్చారు. అనిరుధ్ దగ్గరకు పంపారు. ఎందుకు? అంటే… అనిరుధ్ రవిచంద్రన్ అడిగారు. పులిని పంపమని అనిరుధ్ ఎందుకు అడిగారు? అంటే… ఓ పాట చేసిపెట్టమని హరీష్ రామ్ అడిగితే ఫీల్ రావడం కోసం పులిని పంపమని అడిగారు. దర్శకుడు అలాగేనని పంపారు. తర్వాత ఏమైంది? పులి వచ్చింది! అనిరుధ్ రవిచంద్రన్ లో ఫీల్ కూడా! వెంటనే ట్యూన్ చేసేశారు. ఆ పాటను ‘తుంబా’లో వినొచ్చు.
ఇంతకీ, అనిరుద్ రవిచంద్రన్ ని అంతగా భయపెట్టినదీ… కంగారు పెట్టినదే… కేకలు పెట్టించినదీ… విజువల్ ఎఫెక్ట్స్ పులి. అవును… నిజమే! గ్రాఫిక్స్ ద్వారా సృష్టించిన ఆ పులిని చూస్తే… ప్రేక్షకులు కూడా నిజమైన పులి అని నమ్మేస్తారు. ఒక్క పులి మాత్రమే కాదు.. మా సినిమాలో కోతి, ఇతర జంతువులను చూస్తే, నిజమైన జంతువులే అనే అనుభూతి కలుగుతుందని నిర్మాత సురేఖ అంటున్నారు.