మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టి చాలా మంది హీరోయిన్స్ గా టర్న్ అయ్యారు. అలాంటి అందగత్తెలలో సోని చరిష్టా ఒకరు. మోడలింగ్ లో క్రేజ్ తెచ్చుకున్న ఆమె 2005లో వచ్చిన ప్లీజ్ నాకు పెళ్లైంది సినిమాతో… తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపాలీ బ్యూటీకి ఆ సినిమా కలిసి రాలేదు. ఆ తర్వాత… యుగళగీతం, ప్రేమ ఒక మైకం, మిస్టర్ రాజేష్, నాకైతే నచ్చింది, టాప్ ర్యాంకర్స్ వంటి సినిమాల్లో చేసింది. అయితే ఏ సినిమాకూ ఆమె కు కెరీర్ కు ప్లస్ కాలేకపోయింది.

అదే సమయంలో బుల్లి తెరపైనా కనిపిస్తూ… సీరియల్స్‌లో మంచి పేరు తెచ్చుకుంది. అలా సౌత్ ఇండస్ట్రీలో సినీ ఆఫర్లు తో సీరియల్స్ చేస్తున్న ఈ సొగసుల సుందరికి…ఆ మధ్యన బాలీవుడ్ నుంచి కూడా ఛాన్సులు వస్తున్నాయని వార్తలు వచ్చాయి. వాటి సంగతమో కానీ.. అందంతోపాటూ… ఆహార్యంతోనూ కట్టిపడేసే సోనీ చరిష్టా క్యూట్ ఫొటోస్ లతో కుర్రకారు గుండెలను కబడ్డీ ఆడేస్తోంది. మీరూ ఓ లుక్కేయండి..

Click Here Gallery

Similar Posts
Latest Posts from VendiTera.com