లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులను అక్కున చేర్చుకొన్న బాలీవుడ్ నటుడు సోనుసూద్‌. కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో సోనుసూద్ ఎంతో మందికి అండగా నిలిచారు. ఇటీవల సోనూసూద్ కు తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో గుడి కట్టించిన సంగతి తెలిసిందే.

తాజగా హైదరాబాద్ లోని బేగంపేట కు చెందిన అనిల్ అనే యువకుడు తన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు సోను సూద్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని పేరు పెట్టడం జరిగింది. సోను సూద్ పేరు పెట్టడంతో తనకు బిజినెస్ రెట్టింపు అయ్యిందని అనిల్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లోని బేగంపేటలో ని సోనూసూద్ పాస్ట్ ఫుడ్ సెంటర్ ను సోనూసూద్ సడన్ విజిట్ చేశారు.

Similar Posts
Latest Posts from VendiTera.com