Banner

నా ఉచ్చ్వాసం కవనం….నా నిశ్వాసం గానం
సర సస్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం ….
విరించినై విరచించితిని ఈ కవనం…
విపంచినై వినిపించితిని ఈ గీతం….

తెలుగు సినిమా పాటకు సాహితీ గౌరవాన్ని కలిగించిన సీతారామశాస్త్రి గుర్తు లేనిది ఎప్పుడు.  ప్రతీ రోజు ఆయన పాట విన్న ప్రతీ సారి ఆయన గుర్తు వస్తూనే ఉంటారు.  జరుపుకోవాలి కాబట్టి ఆయన జయంతి అని ప్రత్యేకంగా జరుపుకోవటం అంతే. ఆయన  అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎంతో అభిమానం. మే 20 ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి పుట్టిన రోజు. ఆయన అభిమానులు. ఆయనతో పాటు పనిచేసిన వారంతా ఏదో ఒక మార్గంలో ఈ ఉత్సవాన్ని మే 20న అంటే ఈ రోజు ఘనంగా జరుపుతున్నారు. ఆయన సమగ్ర సాహిత్యాన్ని పుస్తక రూపంలో తీసుకవస్తున్నారు.  సినీ గీతాలను నాలుగు సంపుటాలుగా, ఇతర సాహిత్యాన్ని రెండు సంపుటాలుగా ప్రచురిస్తున్నారు.

ముప్పై సంవత్సరాల వయసులో చేంబోలు సీతారామశాస్త్రి…నుంచి  ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గా రూపాంతరం చెందారు.  ఆ తర్వాత ఆయన ప్రయాణం తెలుగు సినిమా ప్రతీ రోజు ..ప్రతీ క్షణం గమనిస్తూనే ఉంది.  ప్రతీ పాటా..ప్రతీ మాటా ఆయన్ని గుర్తు చేస్తూనే ఉంది.  ఆ తర్వాత ముప్పై వసంతాలకు ‘పద్మశ్రీ’ సిరివెన్నెల సీతారామశాస్త్రి అయ్యారు. గత యేడాది నవంబర్ 30న కన్నుమూసే వరకూ ఆయన పాటతోనే ప్రయాణించారు. పాటనే పలవరించారు. ప్రేమించారు…పరవశించారు.

ఆయన  ఆలోచనల పక్షిలా ఎక్కడెక్కడికో ఎగురుతూ, ప్రపంచం అంతా తిరిగొచ్చినట్టు వచ్చేసి పాటలా నాకు ఇచ్చేసేవారని ఆయనతో పనిచేసిన వారు చెప్తూంటారు. అలాగే ఆ పక్షి స్వర్గానికి వెళ్లి అక్కడ పాటను కడుతోంది. మాటను చుడుతోంది. ఆ ఎక్స్‌పీరియ‌న్స్ అంతా ఓ అద్భుతం. ఆయన విసుక్కోవడం నేను చూడలేదంటారు మరొకరు ఆయన్ని తలుచుకుంటూ. ‘శాస్త్రిగారు… మరో వెర్షన్ కావాలి’ అంటే వెంటనే రాసి ఇచ్చేవారని ఆయన్ని గుర్తు చేసుకుంటూ కళ్లు చెమర్చుతూ చెప్తారు వేరొకరు. ఏదో రాశామంటే రాశాం అన్నట్టు కాకుండా… నా ప్రతి సినిమా కథను షాట్‌తో సహా వినేవారు. కథకు తగ్గట్టు భావం వచ్చేలా పాటలు రాసేవారు. ఆయన రాసిన ప్రతి పాట శాశ్వతమే అని మురిసిపోతారు మరో పెద్ద నిర్మాత.

ఇదిలా ఉంటే ఆయన  కుటుంబ సభ్యుల సహకారంతో తానా ప్రపంచ సాహిత్య వేదిక సీతారామశాస్త్రి జయంతి ఉత్సవాన్ని మే 20న ఘనంగా జరుపబోతోంది. ఆయన సమగ్ర సాహిత్యాన్ని పుస్తక రూపంలో తీసుకురానుంది. సినీ గీతాలను నాలుగు సంపుటాలుగా, ఇతర సాహిత్యాన్ని రెండు సంపుటాలుగా ప్రచురిస్తున్నారు. ఈ బృహత్ కార్యక్రమాన్ని నవంబర్ 30 తేదీలోగా పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉంది. ఇందులో తొలి సంపుటాన్ని భారత ఉపరాష్ట్రపతి, గౌరవనీయులు ఎం. వెంకయ్యనాయుడు మే 20వ తేదీ సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగే కార్యక్రమంలో ఆవిష్కరించబోతున్నారు.

ఈ జయంతి పూట సీతారామశాస్త్రిగారిని telugu100.com  మరోసారి స్మరించుకుటోంది.

Banner
, , , , ,
Similar Posts
Latest Posts from VendiTera.com