తొలిసారి దేశంలో అతిపెద్ద ఓపెన్ ఎయిర్ థియేటర్ ముంబైలో ప్రారంభం అయ్యింది. రూఫ్-టాప్ థియేటర్ అయిన దీంట్లో కారులో కూర్చునే సినిమాను చూడవచ్చని రిలయన్స్ రిటైల్ తెలిపింది. ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ షాపింగ్ మాల్లో దీనిని ప్రారంభించిన్నట్టు పేర్కొంది. పీవీఆర్ సినిమాస్ ఈ సినిమా హాల్‌ను నిర్వహిస్తుంది. అతిపెద్ద స్క్రీన్ కలిగిన ఈ థియేటర్ 290 కార్ల సామర్థ్యం కలిగి ఉంది.
ఈ థియేటర్ బహిరంగ ప్రదేశంలో చాలా విస్తీర్ణంలో ఉండేలా ఏర్పాటు చేసారు. ఇన్నాళ్లూ ఇలాంటి థియేటర్లు ఎక్కువగా మనం విదేశాలలో చూస్తున్నాము. ఈ థియోటర్ లో చూసే సమయంలో ..మనుషులు ఒకరికొకరు దూరంగా ఉంటారు. దీనివల్ల వైరస్ వంటివి సోకే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ప్రజలు తమ కారులో లేదా పెద్ద సినిమా స్క్రీన్ ముందు ఎక్కడైనా కూర్చుని సినిమాని ఆస్వాదించవచ్చు. రిలయన్స్ ఇప్పుడు వరసగా ఇలాంటి కొన్ని ఓపెన్ ఎయిర్ థియేటర్‌ను నిర్మించబోతోంది. వీటికి జియో డ్రైవ్-ఇన్ థియేటర్ అని పేరు పెట్టారు.
కరోనా సమయంలో ఇలాంటి థియేటర్లు ఉంటే ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ సినిమాని ఎంజాయ్ చేయవచ్చు. ఇలాంటి థియేటర్లకు పెద్ద ఔట్ డోర్ స్క్రీన్ ఉంటుంది. అందులో తమ సౌలభ్యం ప్రకారం కారులో ఉండి సినిమాని వీక్షించవచ్చు. వాయిస్ కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఉపయోగిస్తారు. లేదా బాహ్య స్పీకర్లు ఇన్స్టాల్ చేస్తారు.
ఈ థియేటర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు కారును ఓపెన్ ఏరియాలో పెట్టుకుని, అందులో నుంచే చూడవచ్చునని చెబుతున్నారు సంస్థ నిర్వహకులు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి తర్వాత సినిమా, థియేటర్ వ్యాపారం నష్టాలపాలైంది. ప్రస్తుతం కొన్ని థియేటర్లు తెరుచుకుంటున్నప్పటికీ కరోనా సోకుతుందనే భయం వారిలో ఉంది. ఓపెన్ ఎయిర్ థియేటర్ అనే కాన్సెప్ట్ విదేశాల్లో చాలా సక్సెస్ అయ్యింది. మన దేశంలో మాత్రం రిలయన్స్ తీసుకుని వస్తున్నదే ఫస్ట్ థియేటర్.
ఈ సందర్భంగా రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ.. ఆధునిక వినియోగదారుల షాపింగ్‌ను మరింత అద్భుతమైన అనుభవంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం నుంచే జియో వరల్డ్ పుట్టుకొచ్చిందని చెప్పారు.
వాణిజ్య రాజధాని అయిన ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఈ జియో వరల్డ్ డ్రైవ్ ఉంది. అతిపెద్ద స్క్రీన్ కలిగిన ఈ థియేటర్లో 290కార్ల సామర్థ్యం ఉంటుంది. 17.5 ఎకరాల విస్తీర్ణంలో జియో వరల్డ్ డ్రైవ్ ఉంది.