‘రంగస్థలం’పై అద్బుతమైన విశ్లేషాత్మకమైన రివ్యూ

రామ్‌చరణ్‌ హీరోగా నటించిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్‌ నటన, సుకుమార్‌ దర్శకత్వ ప్రతిభకు సినీ అభిమానులు ఫిదా అయిపోయారు. రామలక్ష్మిగా  సమంత నటననూ మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ సినిమా గురించి మాట్లాడేసారు. సోషల్ మీడియాలో ట్వీట్స్, పోస్ట్ లు పెట్టేసారు. వెబ్ సైట్స్ రివ్యూలు ఇచ్చేసాయి. అయితే ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణగారు మాత్రం వాటిన్నటికి విభిన్నంగా వివరణాత్మకంగా తనదైన శైలిలో ఈ సినిమాలో హెలెట్స్ ఏమిటి..మైనస్ లు ఏమిటి అనే విషయాలు వివరించారు. సినిమాలు రిలీజ్ అయ్యినప్పుడు రివ్యూలు రావటం అతి సాధారణంగా జరిగే పని. అయితే సినిమా పరిశ్రమకు సంభందం లేని వాళ్లు ఈ రివ్యూలు రాస్తూంటారు. సినిమా గురించి ఏ మాత్రం ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా రివ్యూలు రాసేస్తారు..అనే అపవాదు సైతం ఇలాంటి రివ్యూలపై ఉంది. అలాగని సినిమా వాళ్లు ఎప్పుడూ  రిలీజైన సినిమాలు చూసి రివ్యూలు ఇవ్వరు. రాజమౌళి వంటి వారు సినిమా చూసి బాగున్నప్పుడు కేవలం ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూంటారు. అంతేకానీ ఆ సినిమాలోని విశ్లేషణ చేయరు. కానీ ఆ సాహసాన్ని  సీనియర్ దర్శకుడు గీతా కృష్ణ గారు చేస్తున్నారు.