`విశ్వామిత్ర’ టీజర్‌ లాంచ్ చేసిన నందిత‌

ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ప్రెస్ మీట్‌లో… క‌థానాయిక నందిత మాట్లాడుతూ  ‘‘చాలా గ్యాప్‌ తర్వాత చేస్తున్న సినిమా ఇది. కేవలం గ్యాప్‌ను ఫిలప్‌ చేసుకోవడం కోసం చేయలేదు. చాలా ఇంట్రస్టింగ్‌గా  అనిపించింది. వైవిధ్యంగా అనిపించింది. స్ర్కిప్ట్‌ నచ్చి చేశాను. దర్శకుడు చెప్పింది చెప్పినట్టు తీశారు. అఽశుతోష్‌గారితో పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయనతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకోవడాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేను. అందమైన థ్రిల్లర్‌ ఇది. న్యజిలాండ్‌లో జరిగిన వాస్తవ ఘటనల నేపథ్యంలో సాగుతుంది’’ అని అన్నారు. దర్శకుడు రాజ్‌కిర‌ణ్‌ మాట్లాడుతూ ‘‘నేను ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఈ కథను చాలా మంది దగ్గరకు తీసుకెళ్లాను. కానీ పలువురు వినడానికి కూడా ఆసక్తి చూపించలేదు. ఆ తరుణంలో సంకల్పబలంతో నేను రాజకిరణ్‌ సినిమా అనే సంస్థను మొదలుపెట్టాను. షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యే సమయానికి అందరూ సెట్‌ అయ్యారు. డిసెంబర్‌ మొదటివారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. న్యూజిలాండ్‌లో జరిగిన యథార్థ గాథ ఇది. అమెరికాలో జరిగిన కొన్ని అంశాలను కూడా మిళితం చేశాం. థ్రిల్లర్‌ తరహా చిత్రం. హారర్‌  కాదుగానీ, కొంచెం హారర్‌ టచ్‌ మాత్రం ఉంటుంది. కథ వినగానే నందిత యాక్సెప్ట్‌ చేశారు. అశుతోష్‌ రాణా ఇందులో మెయిన్‌ విలన్‌గా నటించారు’’ అని అన్నారు.