‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ఇన్నర్ సర్కిల్ టాక్ ఏంటంటే..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. పూర్తి స్దాయి యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్‌గా
కనిపించనున్నారు. లగడపాటి శ్రీధర్, నాగబాబు సంయుక్తం నిర్మిస్తున్న ఈ సినిమా మే 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో ఫైనల్ అవుట్ పుట్ ని కొంతమంది సినిమా కు చెందిన
టీమ్ చూడటం జరిగింది. వారు చెప్పేదాని ప్రకారం..అల్లు అర్జున్ కెరీర్ లో ఈ సినిమాలో బెస్ట్ సినిమాగా నిలిచిపోనుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు అయితే పండుగే.
అల్లు అర్జున్ అనగానే గుర్తుకొచ్చే విషయం స్టైల్.. ఆయన ఏ పాత్ర చేసినా.. అందులో ఓ ప్రత్యేకమైన స్టైల్ కనిపించాల్సిందే. తాజా చిత్రంలో ఆర్మీ అధికారిగా కనిపించనున్న బన్ని స్టైల్
విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ స్టైల్స్ సినిమా రిలీజ్ అయ్యాక కుర్రాళ్లను ఊపేస్తాయనటంలో సందేహం లేదంటున్నారు. హెయిర్ మొదలుకొని బన్ని ఎక్సప్రెషన్స్ వరకూ అన్నీ
కొత్తగా ఉండబోతున్నాయి. అంతేకాదు ఈ సినిమా కోసం బన్ని,ఆయన టీమ్ ఎంత కష్టపడుతున్నారో టీజర్స్, ట్రైలర్స్ ను చూస్తే అర్థమవుతోంది.
లగడపాటి శిరీషా శ్రీధర్, బన్ని వాసులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో
శరత్‌కుమార్, అర్జున్, ఠాకూర్ అనూప్ సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విశాల్-శేఖర్ బాణీలు సమకూరుస్తున్నారు