‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ని నిలబెట్టినవి ఇలాంటివే

కొన్ని డైలాగులు లేదా సన్నివేశాలు దర్శకుడు లేదా రచయిలతలోని సృజనాత్మకతను, డెప్త్ ని పట్టిస్తాయి. అవే సినిమా హిట్ కు కూడా కారణం కావచ్చు. బయిట జనాల్లో అవి హాట్ టాపిక్ గా మారచ్చు. అలాంటి డిటేలింగే అల్లు అర్జున్ తాజా ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’కు ప్లస్ అయ్యింది. అందులో ఉదాహరణకు ఒకటి మీకు గుర్తు చేస్తున్నాం. ఇండియన్ ఆర్మికు చెందిన పది బెస్ట్ కోట్స్ లో ఒకటైన “Only best of the friends and worst of the enemies visit us” ( స్నేహితుల్లో బెస్ట్, శత్రువుల్లో వరస్ట్ అయిన వారు మాత్రమే మమ్మల్ని కలుస్తారు) ని సినిమాలో ఆర్మి హెడ్ క్వార్టర్స్ దగ్గర కనపడే బోర్డ్ గా చూపిస్తారు. ఇది చూపించకపోయినా సినిమా కథకు వచ్చే నష్టమేమీ లేదు కానీ చూపటం వలన వారు సినిమాని ఎంత నిజాయితీ,నిబద్దతతో చేసారో అర్దం చేసుకునే అవకాసం కలిగించింది. వారు చేసిన రీసెర్చ్ మనకు అర్దమవుతుంది. అలాంటివి బోలెడు విషయాలు మనకు ఈ సినిమాలో కనపిస్తాయి. సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా సామాజిక భాధ్యత కూడా కలిగి ఉంటే మంచిది అని ఆలోచించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అదీ తొలి సినిమా చేస్తున్నప్పుడు అలా ఆలోచించాలంటే భయం వేస్తుంది. ఏ మాస్ సినిమానో చేసి సూపర్ హిట్ కొట్టి సెటిల్ అయ్యిపోవాలనుకుంటారు. కానీ చిత్రంగా రచయత నుంచి దర్శకుడుగా మారిన వక్కంతం వంశీ సమాజం పట్ల తనుకున్న భాధ్యతను అత్యంత శక్తివంతమైన మీడియం అయిన సినిమా ద్వారా వ్యక్త పరచాలనుకున్నారు. అందుకు దర్శకుడుగా తన తొలి చిత్రం ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ని వేదికగా ఎంచుకోవటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆయన ఆలోచనకు అల్లు అర్జున్, నిర్మాత లగడపాటి శ్రీధర్,నాగబాబు చేయూత నిచ్చారు. అందుకే కేవలం కమర్షియల్ సినిమాగానే కాకుండా కొద్ది క్షణాలు పాటు ఆలోచనలో పడేస్తూ…మన దేశంపైనా, దేశాన్ని రాత్రింబవళ్లూ రక్షిస్తున్న ఆర్మిపైనా ఉన్న గౌరవాన్ని రెట్టింపు చేస్తూ ఈ సినిమా వచ్చింది. ముఖ్యంగా బన్ని ఈ పాత్రలో ఒదిగిపోయారు అనటం చాలా చిన్నమాట.‘నాకు నా దేశం కావాలి ఇచ్చెయ్’ అంటూ వీరసైనికుడిగా ఆయన విశ్వరూపం చూపించారు ఇక సినిమాలో అన్వర్ గా సాయి కుమార్ …ఓ జీవితకాలం గుర్తుండిపోయే పాత్రను చేసారు. ఇక లగడపాటి శ్రీధర్ గారి అబ్బాయి చేసిన పాత్ర కనపడింది కొద్ది సేపే అయినా అసలు ఎక్కడా కొత్త వాడిలా కనపించకుండా అలా ఎలా చేసాడా అనిపించింది. హ్యాట్యాఫ్ టు హిమ్. ఈ సినిమా గొప్పతనం ఏమిటి.. మనమంతా రాత్రిపూట ఏమాత్రం భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే అందుకు కారణం, రాత్రింబవళ్లు సరిహద్దులను కావలి కాస్తున్న సైనికులే. నిత్యం శత్రుదాడులనుంచి తప్పించుకుంటూ, గుళ్లవర్షాన్ని ఎదుర్కొంటూ, ప్రాణాలను పణంగా పెడుతూ.. మంచుకొండల్లో, ఎడారుల్లో, నదీనదాల్లో, గడ్డగట్టించే హిమవత్పర్వత సానువుల్లో వారు మనోవాక్కాయ కర్మేణా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టే 125 కోట్లకు పైగా భారత జాతి ప్రశాంతంగా జీవిస్తున్నారు. కానీ జాతి భవిష్యత్తుకోసం తమ ప్రాణాలనే ఫణంగా పెడుతున్న ఆ వీర సైనికుల నుంచి మనం ఎంతసేపు ఆలోచిస్తున్నాం…అయితే ఈ సినిమా మాత్రం ఆలోచించింది.. అదే ఈ సినిమా గొప్పతనం ఇండియా ఆర్మి గురించి తొలిసినిమాలోనే విస్తృతంగా చర్చించిన ఈ దర్శకుడు విజ్ఞతకు, సృజనాత్మకతకు దేశం కోసం ఆలోచించే వారంతా రుణపడి ఉంటారు. ఇలాంటి దేశభక్తి సినమాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందనేది కాదనలేని సత్యం.