Banner

ఏవండీ..ఎవరండీ ఆయన…ఎప్పుడూ పేరు వినలేదు… ఆయన గురించి ఆ ఫేస్ బుక్  లో పోస్ట్ లు ఏంటి..ఆ హడావిడి ఏమిటి..ఏం పేరండీ..ఎవరో ముళ్లపూడి వెంకట రమణట..ఓహ్…ఆయన పుట్టిన రోజు కదా..అందుకే…అభిమానులు..అభిమానులా..ఏం చేస్తూంటారు ఆయన…ఎందుకీ హంగామా..ఓ ముక్క చెప్పచ్చు కదా.. ఆపమని ..రైటే అనుకోండి…ఆయన చెప్పలేరండి…ఎందుకంటే ఆయన స్వర్గానికి వెళ్లిపోయారండీ…ఓకే…బ్రతికున్నప్పుడు ఆయన ఏం చేసావారో…ఏం చేసావారు అంటే.. రాసేవారు…ఏం రాసేవారు…కథలు, సినిమాలకు డైలాగులు, స్క్రీన్ ప్లే లు గట్రా..బోలెడు రాసారు లెండి…ఎప్పుడూ ఆయన గురించి వినలేదండీ..ఆయన రాసిన డైలాగులు విని ఉంటారండీ…డైలాగులా… ఏదీ ఓ సినిమా చెప్పండి…ముత్యాల ముగ్గు…ఏదీ శ్రీధర్, సంగీత చేసారు అదేనా…అవునండీ… సెగట్రీ! పైనేదో మర్డరు జరిగినట్టు లేదూ ఆకాసంలో!….సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ? ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కూసంత కలాపోసనుండాల. ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏటుంటది? అన్న డైలాగు వారిదేనా…
అవును..అవును…సరిపోయింది…ఈ సినిమా ఒక్కటేనా ఇంకా..రాసారా…చాలా రాసారు లెండి..ఏదీ మచ్చుకు ఒక్కటి..ప్లీజ్
అమ్మకుట్టీ…..పెళ్ళంటే..పాలల్లో పాలలా కలిసిపోవడం…పంచదారలా కరిగిపోవడం…పెళ్ళంటే నమ్మకం…ఆ నమ్మకం తిరుగు లేనిది…అది దీపం లాంటిది,దానిమీద అనుమానపు నీడలు పడవు..అనుమానం ఉన్న చోట.. ‘నారాయణా’ అన్నా బూతులా వినిపిస్తుంది…నమ్మకం ఉన్న చోట.. బూతు కూడా ‘నారాయణ’ అన్నట్టే వింపిస్తుంది….
“గుండెల్లో గూడు కట్టుకున్న ప్రేమని.. చీటికీ, మాటికీ బయట చెప్పుకుంటామా…”
ఇది ..పెళ్లి పుస్తకం లోది కదూ…పెళ్ళి గురించీ, ప్రణయం గురించీ చాలా బాగా చెప్పారు సుమండీ..
సుమగారు చెప్పినవి కాదు..రమణగారు రాసిన డైలాగులు ఇవి..అబ్బో మీరు రమణ గారు లా మాట్లాడుతున్నారే..కొంపతీసి రమణగారా ఏమిటి..కాదులెండి…మరే ఎలాగూ ఖాళీగా ఉన్నట్లున్నారు..ఇంకో రమణగారి గురించి ఇంకో రెండు మాటలు చెప్పచ్చు కదా…ఖాళీగా ఉన్నాను అని మీరు అనేసాక..ఖాళీగా లేను అని ప్రూవ్ చేసుకోవాల్సిన కర్తవ్యం నాకు ఉంది కాబట్టి…నేను …ఇంక రమణ గారి గురించి మాట్లాడను..ఇదిగో ఇదంతా రాస్తున్నాడే ..అతన్నే అడిగి రమణగారి గురించి తెలుసుకోండి.. 
సర్లే ఆయన కోపగించి చెప్పటం ఆపేసారు కాబట్టి..నేను ఈ ఆర్టికల్ రాసేవాడిని కాబట్టి రమణ గారి గురించి ఇంకో రెండు మాటలు చెప్పక తప్పదు… 
ఒకాయన ముళ్లపూడి వారి వద్దకు వచ్చాడు. ఆ మాటా ఈ మాటామాట్లాడుతూ ” మద్రాసులో ఎక్కువ అరవవాళ్ళే వుంటారు కదా ?వాళ్ళ మధ్యలో తెలుగు వాళ్ళను పోల్చుకోవడం ఎలా?” అన్నాడు.రమణగారు ఆయనకు తన మార్కు జవాబిచ్చారు.”ఏముందీ ? మీరు పేపరు కొని చదువుతుంటే, మధ్యలో ఆపేపర్ ఎవరు తీసుకుంటారో వాడే తెలుగువాడు!”
ఈ పంచ్ ఎలా ఉంది..అచ్చం రమణగారిది లా ఉంది ..
అయ్యా రమణ గారు అన్నారనే   చెప్పుకుంటున్నాం.. మళ్ళీ ఆయన అన్నట్లే  ఉందంటారేం….సరే..అప్పు మీద ఆయన చెప్పిన అద్బుతమైన సూక్తులతో దీన్ని ముగిస్తున్నాం..మీకేమన్నా అభ్యంతరమా..
“జీవితమే పెద్ద అప్పు”” అప్పడక్క పోతే వాడేవడో మనమెవడోఅడిగితేనే ఇవ్వడం, ఇస్తేనే పుచ్చుకోవడంపుచ్చుకుంటేనే మళ్ళీ ఇవ్వడం ఈ మూడూలేకపోతే జీవితం బోరు కొట్టెయ్యదూ “
ఇదిగో మాస్టారు…రమణగారు గురించి ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాలి….ఏం పెడదామా అని ఆలోచిస్తూంటే ఇదిగో ఈ ట్రిక్ తట్టింది..ఆయన గురించి తెలియదంటే బోలెడు మంది బోలెడు చెప్తారు కదా..అందులోంచి కొంత తీసుకుని ఇలా పోస్ట్ పెట్టేస్తే పోతుందని…అదన్నమాట అందుకే మిమ్మల్ని విసిగించాను..నా బస్ వస్తోంది.. ఫేస్ బుక్ లో కలుసుకుందా..బై..

Josyula Surya Prakash

Banner
Similar Posts
Latest Posts from VendiTera.com