లాగిన్ మీడియా ప్రొడక్షన్ నెం 2 చిత్ర ప్రారంభోత్సవం..

లాగిన్ మీడియా శ్రీధర్ రెడ్డి ఆశీస్సులతో బాలరాజు గౌడ్ సమర్పించు ప్రొడక్షన్ నెంబర్.2 సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్ లోని బొడుప్పల్ లోని బంగారు మైసమ్మతల్లి దేవాలయం లో రాజకీయ ప్రముఖుల నడుమ ఘనంగా జరుపుకుంది.. అనంతరం   ఎం.యస్.ఆర్. ఆధ్వర్యం లో… బైక్ ర్యాలీ ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి బొడుప్పల్ వరకు దాదాపు వెయ్యి మంది యూత్ బైక్ ర్యాలీని నిర్వహించారు.. ఈ సందర్భంలోనే ఈ నూతన చిత్రానికి  సర్వే సత్యనారాయణ క్లాప్ నివ్వగా, సుధకర్ రెడ్డి ఎల్బీనగర్ ఎమ్ ఎల్ ఎ (మాజీ)  కెమెరా స్విచ్ ఆన్ చేయగా, స్క్రిప్ట్ ను జగయ్య యాదవ్, బండారు లక్ష్మణ్ రెడ్డి అందించగా,  మాజీ మేయర్ శ్రీమతి బండ కార్తీక రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు… అనంతరం సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ… ప్రొడక్షన్ 2 సినిమా ఓపెనింగ్ ను ఇక్కడ ఈ అమ్మవారి దేవాలయంలో జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉంది.. యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని,  ఇదువరకె ఈ బ్యానర్లో వచ్చిన హ్యాక్ డ్ బై డెవిల్ చిత్రం లా అవార్డులు సొంతం చేసుకోవాలని, సినిమాలో నటిస్తున్న నటీ నటులందరికీ మంచి పేరు రావాలని ఆశిస్తున్నా… అన్నారు..