డాన్సింగ్ సెన్సేషన్-ప్రముఖ నటుడు-దర్శకుడు ప్రభుదేవా సోదరుడు నాగేంద్ర ప్రసాద్, రాజ్ కుమార్, శ్రీజిత్ ఘోష్, రాంకీ (నిరోష), మనోబాల, ఊర్వశి, జూనియర్ బాలయ్య ముఖ్య తారాగణంగా వెంకీ ఏ.ఎల్ దర్శకత్వంలో తమిళంలో రూపొంది డాన్సులతో ఉర్రూతలూగించిన ఓ చిత్రం “డాన్స్ రాజా డాన్స్”గా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. భీమవరం టాకీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఈ చిత్రం ఫస్ట్ లుక్ తమిళనాడు మాజీ గవర్నర్-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోశయ్య ఆవిష్కరించారు. నృత్య ప్రధానంగా రూపొందిన “డాన్స్ రాజా డాన్స్” మంచి విజయం సాధించాలని రోశయ్య అభిలషించారు.

అమృత హృదయులైన రోశయ్యగారి చేతుల మీదుగా తమ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ కావడం తమకు గర్వకారణం మాత్రమే కాకుండా విజయసూచకమని తుమ్మలపల్లి అన్నారు. ఈ చిత్రం కోసం ఎం.ఎం.శ్రీలేఖ ఆలపించిన నాలుగు పాటలూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఊర్వశి OTT డైరెక్టర్ రవి కనగాల పాల్గొని అభినందనలు తెలిపారు.

ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: చందు అది, ప్రొడక్షన్ ఇన్ ఛార్జ్: నాగేశ్వరరావు, మాటలు-పాటలు: భారతిబాబు!!

Similar Posts
Latest Posts from VendiTera.com