కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నుంచి… జూన్ 14న భారీ అంచనాలతో వస్తున్న సెన్సేషనల్ బోల్డ్ మూవీ “ఐ లవ్ యు”

కన్నడ సూపర్ స్టార్ ఊపేంద్ర ఇప్పటివరకు చేసిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓం, ఏ, సూపర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తో సంచలనం సృష్టించాడు. ఉపేంద్ర నుంచి సినిమా వస్తుందంటే ఉండే అంచనాలే వేరు. కన్నడలో ఆయన నటించిన ప్రతీ సినిమా తెలుగు బాక్సాఫీస్ ను షేక్ చేసిన సందర్భాలెన్నో. ఇక ఇప్పుడు చాలా కాలం తర్వాత మరో సెన్సేషన్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని తనదైన క్యారెక్టరైజేషన్ తో మనముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. కన్నడలో వరుసగా భారీ హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్ చంద్రు దర్శకత్వంలో ఐ లవ్ యు అనే సినిమాతో ఎంటర్ టైన్ చేసేందుకు ఉంపేద్ర సిద్ధమౌతున్నాడు. తెలుగులో అత్యధిక థియేటర్లలో జూన్ 14న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 8న విశాఖపట్టణం సముద్రతీరంలో  ఐ లవ్ యు ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.