‘ఐ లవ్ యు’ ప్రీ రిలీజ్ ట్రైలర్ విడుదల… త్వరలో విశాఖలో ఆడియో వేడుక!

కన్నడ సూప‌ర్‌స్టార్‌ ఉపేంద్ర నటించిన తాజా సినిమా ‘ఐ లవ్ యు’. ‘నన్నే… ప్రేమించు’ అనేది క్యాప్షన్‌. రచితా రామ్‌ హీరోయిన్‌. తెలుగు పరిశ్రమకు ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’తో దర్శకుడిగా పరిచయం అయిన ఆర్‌. చంద్రు, శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సినిమా ప్రీ రిలీజ్ ట్రైలర్ సోమవారం బెంగళూరులో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ‘ఈగ’ ఫేమ్ సుదీప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్ణాటక విద్యాశాఖ మంత్రి జిటి దేవెగౌడ, మాజీ మంత్రి హెచ్.ఎం. రేవణ్ణ, వైఎస్సార్‌సీపీకి చెందిన‌ ఏపీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి (కావలి నియోజకవర్గం), ‘స్పెషలిస్ట్ హాస్పిటల్స్’ రామచంద్రే గౌడ, ‘మోహన్ మూవీస్’ మోహన్ కుమార్, బహర్ ఫిలిమ్స్ బాషా, లక్ష్మి ప్రసాద్ అతిథులుగా హాజరయ్యారు.
‘ఐ లవ్ యు’ ప్రీ రిలీజ్ ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ఫస్ట్ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయింది. జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్లలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.