ఎమోషనల్ థ్రిల్లర్ తో డా. రాజశేఖర్ కొత్త చిత్రం

తమిళంలో రెండు సార్లు జాతీయ అవార్డ్ గెలుచుకున్న నిర్మాత డా. జి. ధనుంజన్. సమంత అక్కినేని నటించిన ‘యు టర్న్’ సినిమాతో పాటు ను విజయ్ ఆంటోని ‘కొలైకారన్’ ను తమిళంలో విడుదల చేశారు ధనుంజయన్. ఇటీవల మురళీ కార్తీక్, గౌతమ్ కార్తీక్, రెజీనాతో తిరు దర్శకత్వంలో ‘మిస్టర్ చంద్రమౌళి’ సినిమాతో పాటు జ్యోతిక, లక్ష్మీ మంచు తో రాధామోహన్ దర్శకత్వంలో ‘కాట్రిన్ మొళి’ సినిమాను నిర్మించారు ధనుంజయన్. తాజాగా విజయ్ ఆంటోనీతో రెండు వరుస చిత్రాలను నిర్మిస్తున్నారు ధనుంజయన్. డా. రాజశేఖర్ సినిమాతో తెలుగు చిత్రరంగంలోకి అడుగు పెడుతున్నారు. డా. రాజశేఖర్, సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం నటించే ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యస్.పి. శివప్రసాద్, ఫైనాన్షియల్ కంట్రోలర్: సి.ఎ.జి. గోకుల్, పి.ఆర్.వో: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి , సంగీతం: సైమన్.కె.కింగ్, నిర్మాత: డా. జి. ధనుంజయన్, దర్శకత్వం: ప్రదీప్ కృష్ణమూర్తి.