ప్ర‌కృతి మాన‌వుడిపై క‌న్నెర జేసిన ప్ర‌తిసారీ మ‌నిషికి మ‌నిషే తోడుగా నిల‌బ‌డుతున్నాడు. ఇది చాలా సందర్భాల్లో నిరూప‌ణ అయ్యింది. ఇటీవ‌ల తిత్లీ తుపాను కార‌ణంగా శ్రీకాకుళం జిల్లాలోని 165 గ్రామాలు స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్నాయి. జ‌న జీవ‌నం అస్త‌వ్య‌స్థ‌మైంది. ఆస్థి న‌ష్టం ఎక్కువ‌గా జ‌రిగింది. ప్ర‌భుత్వం త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నా.. త‌మ వంతుగా సినీ ప‌రిశ్ర‌మ బాధితుల‌కు ఆప‌న్న హస్తాన్ని అందించ‌డానికి ముందుకు వ‌చ్చింది. అందులో భాగంగా హీరో రాజ‌శేఖ‌ర్‌, ఆయ‌న స‌తీమ‌ణి జీవిత తుపాను బాధితుల‌కు రూ.10 ల‌క్ష‌లు విరాలాన్ని  అందించారు. ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుని అమ‌రావ‌తిలోని ఆయ‌న స్వ‌గృహంలో నేరుగా క‌లుసుకుని రూ.10 ల‌క్ష‌ల చెక్‌ను ఆయ‌న‌కు అందించారు.  

Similar Posts

న‌న్ను న‌మ్మిన‌వారి న‌మ్మ‌కాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు నేను వమ్ము చేయ‌లేదు. ఇప్పుడు అలాగే `ద‌ర్బార్‌`తో మీ న‌మ్మ‌కాన్ని వమ్ము చేయ‌ను – `ద‌ర్బార్‌` ఆడియో ఆవిష్క‌ర‌ణ‌లో సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌

Latest Posts from VendiTera.com