దేశభక్తిని అంతర్గతంగా చూపిస్తూ…సినిమా అంతా చాలా ఇంట్రస్టింగ్ గా నడిపే సినిమాలు

దేశభక్తిని అంతర్గతంగా చూపిస్తూ…సినిమా అంతా చాలా ఇంట్రస్టింగ్ గా నడిపే సినిమాలు అప్పుడప్పుడూ వస్తూ ఊరట ఇస్తూంటాయి. ముఖ్యంగా రంగ్ దే బసంతి, లగాన్, మున్నాభాయి లగే రహో వంటి సినిమాలు మన హృదయంలోకి మెల్లిగా ప్రవేశించి దేశభక్తిని మేల్కొపుతాయి. డైరక్ట్ గా ఈ సినిమాలేమీ దేశభక్తిని భోధించవు. అటువంటి సినిమానే మన తెలుగులో వచ్చిన గూఢచారి. అడవి శేషు… ‘క్షణం’ సినిమాతో అందరి దృష్టినీ తన వైపు ఒక్కసారిగా తిప్పుకున్నాడు. ఇప్పుడు గూఢచారితో సినిమాని ప్రేమిస్తే..చిన్న బడ్జెట్ లో భారీ జేమ్స్ బాండ్ సినిమా తీయచ్చు అని ప్రూవ్ చేసాడు. సినిమాలో ఎన్నో ట్విస్ట్ లు, ఎన్నో ఆశ్చర్యాలు, పైకి స్పై థ్రిల్లర్ లోపల పక్కా దేశభక్తి కథ..ఇంట్రస్టింగ్ స్క్రీన్ తో పరుగులెత్తించాడు. ప్రతి సీన్ లోనూ పూర్తి డీటైలింగ్.. ప్రతి క్యారక్టర్ లోనూ ఏదో స్పెషాలిటీ.. పెద్ద హీరోల సినిమాలకు పోటీ ఇచ్చే యాక్షన్ ఎపిసోడ్లు.. టెన్షన్ పుట్టించే ఇంట్రస్టింగ్ .. అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ ఎలా నిర్వహిస్తారు, వారి సెలక్షన్‌ ఎలా జరుగుతుంది, ఎలా ట్రైన్‌ చేస్తారు లాంటి అంశాలు ఆసక్తికరంగా తెరకెక్కించారు. ముఖ్యంగా సినిమాలో ప్రతీ పాత్ర ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చేలా ప్లాన్ చేసిన స్క్రీన్‌ప్లే సినిమాకు ఫెరఫెక్ట్ మూవీ లుక్ తెచ్చిపెట్టింది.