‘భరత్’ ఒక్కడే తప్పు చేయలేదు

 “భరత్ అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ” అంటూ మహేష్ ..తన తాజా చిత్రం  భరత్ అనే నేనులో ప్రమాణం చేస్తారు. అయితే ఆ ప్రమాణం సమయంలో ఆయన  అంతఃకరణ శుద్ధితో  అనే పదం సరిగ్గా పలకలేకపోతారు. అది ఓ జర్నలిస్ట్ హైలెట్ చేస్తారు. ఇలాంటివి గతంలో మన రాష్ట్రంలోనే కాక మన దేశంలోనూ చాలా సార్లు జరిగాయి  ప్రమాణం స్పీకారం సందర్బంగా పదాలను పలకలేకపోవటం అనే విషయంలో చాలామంది మంత్రుల పరిస్దితి ఇంతే..సరిగ్గా మైక్ ముందుకు పోగానే ఆవరించే ఉద్వేగం, తద్వారా కలిగే ఒత్తిడి, తడబాటు ఉంటుంది.  ఆ టెన్షన్ లో పదాలు తప్పు దొర్లుతాయి. దాంతో ఛానెల్స్ ,మీడియా రెచ్చిపోతూంటాయి. అయితే ఇది కేవలం మన దేశంలో జరిగే పొరపాటు మాత్రమే కాదు… అమెరికా వంటి పూర్తిగా అభివృధ్ది చెందిన దేశాల్లో కూడా ప్రమాణం చేసేటప్పుడు తడబడటం పొరబడటం జరిగింది. అమెరికా మాజీ  ప్రెసిడెంట్ బరాక్ ఒబామా..ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చాలా తప్పులు, పాజ్ లు దొర్లాయని అప్పటి మీడియా హైలెట్ చేసింది. ఇలా చాలా చాలా దేశాల్లో జరిగిన పొరపాటు..దీన్ని మీడియా హైలెట్ చేసే తీరుని ఈ సినిమా పట్టిచ్చింది. అందుకే ఈ రోజు ఈ సినిమాకు ఆ స్దాయి అప్లాజ్ దక్కుతోంది.