కరోనా సమయంలో అందించిన సేవలకు గుర్తింపుగా బసవతారకం హాస్పిటల్‍ ప్రత్యేక అవార్డుకు ఎంపికైంది. ఢిల్లీ రీసెర్చ్ సంస్థ వారు బసవతారకం హాస్పిటల్‍ను బెస్ట్ కోవిడ్‍ వారియర్‍ అవార్డుకు ఎంపిక చేశారు. వీక్‍ మాగ్జిన్‍ వారు అందించే బెస్ట్ క్యాన్సర్‍ హాస్పటల్‍ అవార్డుల్లో ఈ హాస్పిటల్‍ ఆరవ స్థానం పొందింది.

ఈ అవార్డు ప్రోత్సహంతో తాము మరిన్ని సేవలు అందించే ప్రయత్నం చేస్తామని, నిరుపేదల వైద్యం కోసం 3కోట్ల రూపాయలు ట్రస్ట్ కు కేటాయించామని ఆస్పత్రి చైర్మన్‍ నందమూరి బాలకృష్ణ తెలిపారు. మన హాస్పిటల్‍కు 6వ ఉత్తమ క్యాన్సర్‍ హాస్పిటల్‍ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు.

2011లో ఉత్తమ హాస్పిటల్‍ పరంగా 13వ స్థానం లభించిందని.. 2020 నాటికి 6వ స్థానానికి చేరుకున్నామన్నారు. దీనిని మొదటి స్థానానికి తీసుకెళ్లడానికి కృషి చేస్తానన్నారు. అధునాతన పరికరాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో బసవతారకం హాస్పిటల్‍ సేవలు అందిస్తుందని బాలకృష్ణ పేర్కొన్నారు.

Similar Posts
Latest Posts from VendiTera.com