కంప్లీట్ యాక్షన్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన `ద‌ర్బార్‌` క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది – సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌

కంప్లీట్ యాక్షన్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ద‌ర్బార్‌ క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది – సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌ సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌ మురుగదాస్‌ల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం దర్బార్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజిని ఆదిత్య అరుణాచలంగా ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న‌ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఎ.ఆర్‌.మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి జ‌న‌వ‌రి 9న తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా… రామ్ ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ – చాలా రోజులుగా మేం త‌మిళంలో ఓ సినిమాను చేయాల‌ని అనుకుంటున్న త‌రుణంలో ర‌జినీకాంత్‌గారితో సినిమా చేసే అవ‌కాశం రావ‌డం చాలా గొప్ప‌గా అనిపించింది. ఈ అవకాశాన్ని మాకు క‌ల్పించిన మురుగ‌దాస్‌గారికి థ్యాంక్స్‌. స‌మాజం ప‌ట్ల బాధ్య‌త‌తో మంచి మెసేజ్‌తో సినిమాలు చేసే ద‌ర్శ‌కుడాయ‌న‌. ర‌జినీకాంత్‌గారితో చేసిన ఈ జ‌ర్నీ ఎప్ప‌టికీ మర‌చిపోలేం అన్నారు.