Banner

మర్యాద రామన్న సునీల్ హీరోగా రచనా సంచలనం యండమూరి తాజా చిత్రం “అతడు-ఆమె-ప్రియుడు”

“నల్లంచు తెల్లచీర”కు గుమ్మడికాయ-“అతడు-ఆమె ప్రియుడు”కు కొబ్బరికాయ కొట్టిన యండమూరి

ముఖ్య అతిథులుగా హాజరైన నాగబాబు-కోదండరామిరెడ్డి- “మాతృదేవోభవ” అజయ్ కుమార్ అంబికా రాజా

ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. “నల్లంచు తెల్లచీర” చిత్రానికి ఇటీవల గుమ్మడికాయ కొట్టిన యండమూరి… తాజాగా “అతడు-ఆమె-ప్రియుడు” చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. ‘మర్యాద రామన్న’ సునీల్, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ హీరోలుగా… మహేశ్వరి వడ్డి- ప్రియాంక-సుపూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్న “అతడు… ఆమె ప్రియుడు’ చిత్రాన్ని… సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ క్రేజీ చిత్రానికి కూనం కృష్ణకుమారి-కూనం ఝాన్సీ (యు.ఎస్.ఏ) సహ నిర్మాతలు.

“మొన్న చాటింగ్… నిన్న డేటింగ్… ఈరోజు మేటింగ్… రేపు……’ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్ తో మొదలైన ముహూర్తపు సన్నివేశానికి “మాతృదేవోభవ” ఫేమ్ అజయ్ కుమార్ క్లాప్ కొట్టగా.. మెగా బ్రదర్ నాగబాబు కెమెరా స్విచాన్ చేశారు. ప్రఖ్యాత దర్శకులు కోదండరామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. అంబికా రాజా ముఖ్య అతిధిగా హాజరయ్యారు.


నటుడిగా నాగబాబు ప్రస్థానం తన “రాక్షసుడు” చిత్రంతోనే మొదలైందని ఈ సందర్బంగా యండమూరి గుర్తు చేసుకున్నారు. భారతదేశం గర్వించదగ్గ గొప్ప రచయితల్లో ఒకరైన యండమూరి దర్శకత్వంలో రూపొందుతున్న “అతడు..ఆమె.. ప్రియుడు” అసాధారణ విజయం సాధించి… దర్శకుడిగానూ ఆయన పేరు మారుమ్రోగాలని నాగబాబు, కోదండరామిరెడ్డి, అజయ్ కుమార్ ఆకాంక్షించారు. యండమూరి దర్శకత్వంలో “నల్లంచు తెల్ల చీర” అనంతరం వెంటనే “అతడు… ఆమె… ప్రియుడు” చిత్రాన్ని నిర్మించే అవకాశం లభించడం పట్ల నిర్మాతలు రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంతోషం వ్యక్తం చేశారు.


భూషణ్, జెన్నీ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కెమెరా & ఎడిటింగ్: మీర్, నిర్మాణ సారధ్యం: అమర్ చల్లపల్లి, సహ నిర్మాతలు: కూనం కృష్ణకుమారి-కూనం ఝాన్సీ (యు. ఎస్.ఎ), నిర్మాతలు: రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాధ్!!

Banner
, , , , ,
Similar Posts
Latest Posts from VendiTera.com