‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ సుధాకర్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘స్నేహితులందరూ కలిసి చేసిన చిత్రమిది. ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
వీరి నాయుడు మాట్లాడుతూ ‘‘సినిమా మార్కెట్‌లో నన్ను ‘పూర్వి’ రాజు అంటారు. విశాఖలో పూర్వి పిక్చర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ స్థాపించి, పాతిక సంవత్సరాల నుండి విజయవంతమైన చిత్రాలు చాలా విడుదల చేశాను. మా అబ్బాయి శ్రీనివాస్‌, అతడి మిత్రుడు బాలు, ఇద్దరి స్నేహితులు కలిసి ఈ సినిమా చేశారు. ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.