‘సెవెన్’ వ‌రల్డ్‌వైడ్ రైట్స్‌ సొంతం చేసుకున్న అభిషేక్ పిక్చర్స్

‘ఐ థింక్… అయామ్ ఇన్ లవ్ విత్ యు కార్తీక్’ – ఆరుగురు అమ్మాయిలు ఇదే మాట చెప్పారు. అతడు ఆరుసార్లు నవ్వాడు. అరుగురికీ ముద్దులు పెట్టాడు. ముగ్గులోకి దింపాడు. అతడి కథేంటి అనేది జూన్ 5న తెలుస్తుంది. హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘సెవెన్’. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. రమేష్ వర్మ కథ అందించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇప్పటికే శుభం విశ్వనాధ్ సాహిత్యం అందించిన ‘సంపోద్దోయ్ నన్నే’, పులగం చిన్నారాయణ సాహిత్యం అందించిన ‘ఇదివరకెపుడు తెలియదు’ పాటలు విడుదలయ్యాయి. ఇటీవల సినిమా ట్రైలర్ విడుదల అయింది. జూన్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఫస్ట్ కాపీ చూసిన అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా క్రేజీ ఆఫర్ ఇచ్చి సినిమా ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నారు.