మనపనులన్నీ మానుకుని ఓ పదినిముషాల సేపు ఫొటోలకు ఫోజులివ్వండి అంటే మనం ఏమంటాం..వెంటనే పనిచూసుకో..నాకు పనులు ఉన్నాయి అంటాం. కానీ మహేష్ బాబు అలా అనలేదు. రెండు గంటల సేపు అలా కంటిన్యూగా ఫొటోలు దిగుతూనే ఉన్నారు. మహేష్ బాబు సమయం ఎంత విలువైందో మనకి తెలుసు. అయినా సరే ఆయన తన సమయం కన్నా అభిమానులు మరింత విలువైన వారు అని గౌరవం ఇచ్చారు. 
సూపర్ స్టార్ మహేష్ బాబుకు  ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రిన్స్ గా అభిమానుల గుండెల్లో కొలువైన ఆయన తొలి చిత్రం నుంచి  సినిమా సినిమాకు ఫ్యాన్స్ రెట్టింపు అవుతూ వస్తున్నారు. అందుకు కారణం ఆయన నటన, ఎంచుకునే సినిమాలు మాత్రమే కాక, ఆయన అభిమానులతో మెలిగే తీరు అని చెప్తారు. 
ఓ సూపర్ స్టార్ లా కాకుండా అభిమానులతో సాదాసీదాగా , సరదాగా ఓ ఫ్రెండ్ లా మెలగటం ఆయనకే సాధ్యం అంటారు ఆయన్ని దగ్గరనుంచి చూసినవాళ్లు. అందుకేనేమో …ఆయన సినిమా షూటింగ్ జరుగుతోందంటే ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న అభిమానులంతా షూటింగ్ స్పాట్ వద్ద క్యూ కడతారు. ఆయన కూడా ఎంత బిజి షెడ్యూల్ ఉన్నా కొంత సమయం కేటాయించుకుని, వారితో మాట్లాడతారు..ఫొటోలు దిగుతూంటారు.  
తాజాగా భరత్ అనే నేను చిత్రం షూటింగ్ లోనూ అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతూండగా ఎప్పటిలాగే అభిమానులు ఆయన్ని చూడటానికి వచ్చారు. అయితే ఇక్కడో స్పెషాలిటీ ఉంది..మహేష్ బాబు రెండు గంటలు సేపు కంటిన్యూగా అభిమానులతో ఫొటోలు దిగుతూనే ఉన్నారు.
 ఎంతో క్రమ శిక్షణతో ఫ్యాన్స్ అంతా లైన్ లో నిలబడి మరి ఫొటోలు దిగారు. వెయ్యిమందికి పైగా ఫొటోలు దిగారు ఆయనతో . ఆ ఫొటోలను ఈమెయిల్ ఐడిలు తీసుకుని అభిమానుల మెయిల్స్ కు పంపుతామన్నారు. ఇలా అభిమానులను పిలిచి,ఫొటోలు దిగి వారితో అంతంత సేపు గడపటం మామూలు విషయం కాదు. ఏమంటారు. 

Similar Posts
Latest Posts from VendiTera.com